madhavi latha

జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై మాధవీలత ఫిర్యాదు

బీజేపీ నేత, సినీ నటి మాధవీలత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. తనను ప్రాస్టిట్యూట్‌ అంటూ పరుష పదజాలంతో దూషించిన జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై మాధవీలత సైబరాబాద్‌ సీపీకి కూడా ఫిర్యాదు చేశారు. జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
బీజేపీ నేత, సినీ నటి మాధవీలత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. తనను ప్రాస్టిట్యూట్‌ అంటూ పరుష పదజాలంతో దూషించిన జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా), తెలుగు ఫిలిం ఛాంబర్‌కు మాధవీలత ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తాజాగా జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై సైబరాబాద్‌ సీపీకి కూడా ఫిర్యాదు చేశారు. జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisements

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ పార్క్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా న్యూ ఇయర్‌ వేడుకలు నిర్వహించారు. అయితే ఆ వేడుకలకు వెళ్లవద్దని.. అక్కడ మహిళలకు రక్షణ ఉండదని మాధవీలత ఒక వీడియో రిలీజ్‌ చేశారు.

దీనిపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మాధవీలత ఒక సినిమా యాక్టర్‌ అని.. యాక్టర్స్‌ అంతా ప్రాస్టిట్యూట్స్‌నే అని పరుష పదజాలంతో విమర్శించారు. జేసీ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దీనిపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి క్షమాపణలు చెప్పారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డి క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ముగిసిపోతుందని అంతా అనుకున్నారు. కానీ మాధవీలత మాత్రం జేసీని క్షమించలేదు.

Related Posts
13 దేశాల నుండి 75 కు పైగా విశ్వవిద్యాలయాలతో హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రపంచ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను నిర్వహించిన టెక్సాస్ రివ్యూ..
The Texas Review organized the largest World Education Fair in Hyderabad with over 75 universities from 13 countries

హైదరాబాద్‌ : వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ యుఎస్ఏ , యుకె , ఫ్రాన్స్, జర్మనీ మొదలైన దేశాలతో సహా 13 దేశాలకు చెందిన 75 పైగా విశ్వవిద్యాలయాల Read more

Rose plant: ఒక్క గులాబీ మొక్క ఖరీదు రూ.12లక్షలు- ఎక్కడంటే!
ఒక్క గులాబీ మొక్క ఖరీదే రూ.12లక్షలు- ఎక్కడంటే!

తమిళనాడుకు చెందిన ఓ రైతు ఎడారి గులాబీ మొక్కలను పెంచుతూ మంచి లాభాలను గడిస్తున్నారు. ఏటా రూ.50లక్షలు నుంచి రూ.60 లక్షల ఆదాయాన్ని అర్జిస్తున్నారు. ఒక్కో మొక్కను Read more

Onion: తల్లి కూడా చేయని మేలు ఉల్లి చేస్తుంది
Onion: తల్లి కూడా చేయని మేలు ఉల్లి చేస్తుంది

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు అనే సామెత విన్నప్పుడు అది కాస్త అతి శయోక్తిగా అనిపించొచ్చు. కానీ ఈ మాట వెనుక ఉన్న వాస్తవాన్ని Read more

Gold Price : భారత్లో తగ్గనున్న బంగారం ధరలు!
ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు! 10 గ్రాముల పసిడి రూ. 90,450

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించనున్న సుంకాల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై పడనుంది. ఈ సుంకాల కారణంగా భారత్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని Read more

×