మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్..నారా బ్రాహ్మణి ఆస‌క్తిక‌ర ట్వీట్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఈరోజు ఏపీ మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ (రియల్ టైమ్ గవర్నెన్స్) శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో ఉదయం 9.45 గంటలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య మంత్రి లోకేశ్ తన ఛాంబర్లోకి అడుగు పెట్టారు. బాధ్యతలు చేపట్టిన లోకేశ్​కు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతల స్వీకరణకు ముందే లోకేశ్ తన శాఖల్లో ప్రక్షాళన దిశగా అడుగులు వేశారు. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. డీఎస్సీ ద్వారా 16 వేల 347 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసంతకం చేసిన దస్త్రం పైనే సంబంధిత శాఖ మంత్రిగా లోకేశ్ తొలిసంతకం పెట్టారు. మెగా డీఎస్సీ విధివిధానాలు రూపొందించి క్యాబినెట్ ముందుకు పెడుతూ సంతకం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న అర్ధాంగి నారా బ్రాహ్మణి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. “అంతా పల్లెల్లో నుండి అమెరికా వెళితే, అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి, సిమెంట్ రోడ్లతో, ఎల్ఈడీ వెలుగులతో వాటి రూపురేఖలు మార్చేశావ్. పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా అవార్డుల పంట పండించావు. నీ వ్యక్తిత్వహననం చేసిన వారు అవాక్కయ్యేలా వాళ్ల‌కు నువ్వేంటో తెలియజేశావు. సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకొన్నావు. నీ సమర్ధతతో నేటితరం, భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం నాకుంది. కుటుంబపరంగా ఎల్లవేళలా మీకు మా సహకారం ఉంటుంది. కంగ్రాట్స్ డియర్ నారా లోకేశ్” అంటూ ఆమె ట్వీట్ చేశారు.

<blockquote class=”twitter-tweet”><p lang=”te” dir=”ltr”>అంతా పల్లెల్లో నుండి అమెరికా వెళితే, అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి, సిమెంట్ రోడ్లతో, ఎల్ఇడి వెలుగులతో వాటి రూపురేఖలు మార్చేశావ్. పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా అవార్డుల పంట పండించావు. నీ వ్యక్తిత్వహననం చేసిన వారు అవాక్కయ్యేలా వాళ్ళకు నువ్వేంటో తెలియజేశావు. సవాళ్లతో… <a href=”https://t.co/43S0FzXeDi”>pic.twitter.com/43S0FzXeDi</a></p>&mdash; Brahmani Nara (@brahmaninara) <a href=”https://twitter.com/brahmaninara/status/1805118961086075113?ref_src=twsrc%5Etfw”>June 24, 2024</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>