ఇల్లు లేని వారికీ లోకేష్ గుడ్ న్యూస్

Lokesh-speaking-at-Ratchabanda-Sabha-in-Mangalagiri-on-Saturday-night

మంత్రి లోకేష్ ఇల్లు లేని వారికీ గుడ్ న్యూస్ తెలిపారు. బుధువారం మంగళగిరిలో స్థానికులతో నారా లోకేష్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏమైతే పెట్టామో,ఏం చెప్పామో అవన్నీ పూర్తిచేసేలా ప్రయత్నం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

డ్రైనేజీ ,రోడ్లు, తాగునీరు, ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పిస్తామని కూడా వెల్లడించారు. గతంలో ఎవరైతే అధికారులు తప్పు చేశారో వాళ్ళని వదిలేది లేదు… వైసిపి పాలన లో తప్పు చేసిన వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్ లో ఉంటాయన్నారు. కేంద్ర నిధులు రావాల్సి ఉంది ,అవి రాగానే, మంగళగిరి సమస్యల మీద అధికారులతో సమీక్ష సమావేశం పెడతానని పేర్కొన్నారు.