ఈవీఎం లపై జగన్ చేసిన ట్వీట్ ఫై లోకేష్ రియాక్షన్

దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై పెను దుమారం నడుస్తుంది. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్.. ఈవీఎంల స్థానంలో పేపర్‌ బ్యాలెట్ వాడితేనే ప్రజాస్వామ్యం ఫరడవిల్లుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు జగన్ ట్వీట్ చేశారు. “న్యాయం జరగడం మాత్రమే కాదు, కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి” అని జగన్ ట్వీట్ చేశారు.

ఇక జగన్ చేసిన ట్వీట్ ఫై టీడీపీ నేతలు , నెటిజన్లు సెటైర్లు వేస్తుండగా..తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. “ప్రజా తీర్పును అంగీకరించాల్సిందే జగన్. మీకు ప్రజాస్వామ్యం అంటే గిట్టదు. ప్రజల హక్కులను పరిరక్షించడానికి ఏర్పాటైన సంస్థలు, వ్యవస్థలు, వేదికలను మీరు క్రమంగా నాశనం చేస్తూ వచ్చారు. ఏపీ ప్రజలు ఏళ్ల తరబడి సమష్టి కృషితో నిర్మించుకున్నవాటిని మీరు ఒక్క దెబ్బతో కూల్చేశారు.

మీరు 2019లో గెలిచినప్పుడేమో ఈవీఎంలు చక్కగా పనిచేసినట్టా…! ఇప్పుడు మీరు 2024లో ఓడిపోతేనేమో ఈవీఎంలపై నిందలు వేస్తారా…! ఎంతటి నయవంచన! మీరు మీ పదవీకాలంలో విఫలమయ్యారని, అందుకే ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారని ఇకనైనా మీరు గుర్తిస్తే బాగుంటుంది.

అన్నట్టు… ఫర్నిచర్ ను తిరిగి ఎప్పుడు అప్పగిస్తున్నారు? పేదల కోసం ఉపయోగించాల్సిన రూ.560 కోట్ల డబ్బును మీ రుషికొండ ప్యాలెస్ కోసం ఎందుకు ఖర్చుపెట్టారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ప్రశ్నలకు సమాధానాలు కోరుతున్నారు” అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

Let’s face it @ysjagan, you’re allergic to democracy. You systematically destroyed institutions, systems and practices devoted to protecting people’s rights. You struck down in one stroke what the people of AP built collectively over the years.

When you won in 2019, EVMs worked… https://t.co/JMsxb4zVKg pic.twitter.com/uFnOXIhfdM— Lokesh Nara (@naralokesh) June 18, 2024