సనాతన ధర్మంపై వ్యాఖ్యలు: ఉదయనిధిపై కొత్త ఎఫ్ఐఆర్ లకు సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే

పీజీ మెడికల్‌ సీట్లలో స్థానిక కోటా.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటాపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం అనుమతించింది. పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా చెల్లదంటూ ఇటీవల జస్టిస్ సుధాంశు దులియా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

image

ఈ నేపథ్యంలో తమ పిటీషన్‌పై విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దాంతో విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలంటే.. ముందు తాము విచారణ చేపడతామని జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ క్రమంలో తదుపరి విచారణ ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

ఆర్టికల్ 371(డి) అనుసరించి.. ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబిఎస్ చేసిన విద్యార్ధులకూ పీజీలో స్థానికత కోటాలో సీట్లు కేటాయించాలంటూ దాదాపు 100 మంది జూనియర్ వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రల్లో పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా వర్తిస్తుందని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఇక విభజన అనంతరం ఆర్టికల్ 371(డి) పదేళ్ల పాటు మాత్రమే వర్తింపజేయాలన్ననిబంధన ఉందన్న తెలంగాణ వాదనను తెలంగాణ హైకోర్టు ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకోలేదు.

Related Posts
ఎమ్మెల్సీ ఫలితాల్లో ఊహించని విజయం
ఎమ్మెల్సీ ఫలితాల్లో ఊహించని విజయం

తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రేపు ఉదయానికి తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. Read more

నేడు గ్రూప్-2 ఫలితాలు
group2 exam

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలను టీఎస్‌పీఎస్సీ (TSPSC – తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్) నేడు అధికారికంగా విడుదల చేయనుంది. 783 ప్రభుత్వ Read more

‘దబిది దిబిది’ వివాదంపై ఊర్వశి
'దబిది దిబిది' వివాదంపై ఊర్వశి

ప్రస్తుతం తన "దబిది దిబిది" పాటతో వార్తల్లో నిలిచిన నటి ఊర్వశి రౌతేలా, నందమూరి బాలకృష్ణతో కలిసి డ్యాన్స్ చేయడం తనకు కేవలం ఒక ప్రదర్శన మాత్రమే Read more

మరోసారి సమ్మె బాట పట్టిన బెంగాల్ వైద్యులు
bengal doctor back on strike announced total cease work from today

bengal-doctor-back-on-strike-announced-total-cease-work-from-today కోల్‌కతా: కోల్ కతాలో ట్రెయినీ డాక్టర్ అత్యాచారం ఘటన తర్వాత ఆందోళన చేపట్టిన జూనియర్ డాక్టర్లు వారం కిందట తాత్కాలికంగా నిరసన విరమించిన విషయం తెలిసిందే. Read more