Liquor shops lottery today in AP

ఏపీలో నేడే మద్యం షాపుల కోసం లాటరీ

అమరావతి: ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా, 89,882 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.1797.64కోట్ల ఆదాయం వచ్చింది.

అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రావడంతో వాటిని పునః పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 మద్యం దుకాణాలకు అత్యధికంగా 5,764 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా, ఏపీలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు లాటరీ పధ్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నారు. దీంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 15న (రేపు) ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించనున్నారు. దీంతో 16వ తేదీ నుండి రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వస్తుంది.

Related Posts
గగన్ యాన్ కోసం సముద్రయానం పరీక్షలు
Sea trials for the Gaganyaan

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్ యాన్ ముందస్తు పరీక్షలు. పరిశోధనలు ముమ్మరం చేసింది. మరోసారి సముద్రంలో రికవరి పరిశోధనలు మొదలయ్యాయి. భారతీయ నావికాదళం, ఇస్రో సంయుక్తంగా Read more

ఏక్‌నాథ్ షిండేకు అస్వస్థత..థానేలోని ఆస్పత్రికి తరలింపు.. !
Eknath Shinde is sick.. shifted to hospital in Thane.

ముంబయి: మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు అస్వస్థత నెలకొంది. ఆయన ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో థానేలోని ఓ ఆసుపత్రికి తరలించారు. గత మూడు రోజులుగా ఏక్‌నాథ్ Read more

ఇండియాలోనే అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఏదో తెలుసా..?
Howrah Amritsar Mail

భారతదేశంలోని అత్యంత నెమ్మదిగా గమ్యం చేరే రైలుగా హౌరా-అమృత్సర్ రైలు వార్తల్లో నిలిచింది. ఇది 1910 కిలోమీటర్ల దూరాన్ని 37 గంటలు పడుతూ, 111 స్టేషన్లలో ఆగుతూ Read more

అబిడ్స్‌లోని టపాసుల షాప్ లో భారీ అగ్నిప్రమాదం
A massive fire broke out at

హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో మయూర్ పాన్ షాపు సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో క్రాకర్స్‌ షాపులో మంటలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *