Liquor policy case hearing today. Kavitha to attend

నేడు లిక్కర్ పాలసీ కేసు విచారణ.. హాజరుకానున్న కవిత

హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం పాలసీ కేసు విచారణ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట వర్చువల్‌గా ఈరోజు హాజరుకాబోతున్నారు. సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్‌పై జడ్జి కావేరి బవేజా విచారణ జరపనున్నారు. గత విచారణ సందర్భంగా ప్రతివాదులకు సీబీఐ అందజేసిన ఛార్జ్‌షీట్ ప్రతులు సరిగ్గా లేవని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

తమకు అందజేసిన చార్జ్‌షీట్ కాపీల్లో చాలా పేజీలు బ్లాంక్‌గా ఉన్నాయని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు కోర్టుకు తెలిపారు. సరైన డాక్యుమెంట్స్ సప్లై చెయ్యాలని సీబీఐని రౌస్ అవెన్యూ కోర్ట్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (శనివారం) అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరుకాబోతున్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో గత 2 ఏళ్లుగా జైలులో ఉన్న మనీష్ సిసోడియాకు, కొన్ని నెలలు జైలు జీవితం గడిపిన ఎమ్మెల్సీ కవితకు కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా కొన్ని రోజుల క్రితమే బెయిల్ వచ్చింది. బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

Related Posts
సోనియా వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు
సోనియా వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలైన తొలి రోజు, రాష్ట్రపతి ప్రసంగంపై అధికార, విపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా Read more

సమంత ఇరగదీసింది
sam dance

వరుణ ధావన్ రాబోయే సినిమా ‘బేబీ జాన్’ నుంచి ఇటీవల విడుదలై దుమ్ము రేపుతున్న ‘నైన్ మటక్కా’ సాంగ్‌కు సమంత, వరుణ్ ధావన్ వేసిన డ్యాన్స్ సోషల్ Read more

టెస్లా ప్రతినిధులతో నారా లోకేష్‌ సమావేశం
lokesh busy us

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా అనేక కంపెనీల ప్రతినిధులతో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలను ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పర్యటనలో Read more

పేర్ని నానిపై ఎటువంటి కక్ష లేదు – నాదెండ్ల మనోహర్
No bias against Perni Nani - Nadendla Manohar

వైసీపీ నేత పేర్ని నానిపై తమకు ఎటువంటి వ్యక్తిగత కక్షా లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 'మా ప్రభుత్వానికి కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *