ఏపీలో మద్యపాన నిషేధం సాధ్యం కాదు – అసెంబ్లీలో తేల్చేసిన పవన్ కల్యాణ్

ఏపీలో మద్యపాన నిషేధం అనేది సాధ్యం కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేశారని..కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం అడ్డుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో మద్యపాన నిషేధం సాధ్యం కాదని పవన్ పేర్కొన్నారు. అయితే మద్యానికి బానిసలుగా మరారని ప్రజల కోసం డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై వచ్చిన ఆదాయంలో 10 శాతం డీ అడిక్షన్ సెంటర్లు నిర్వహణ కోసం ఉపయోగించాలని సభలో కోరారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో దోపిడీ జరిగిందని, వాటిపై సభలో తాము నిలదీస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందేమోనన్న భయంతో వైసీపీ నేతలు సభకు రాకుండా తప్పించుకుని పారిపోయారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి పై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ లిక్కర్ పాలసీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.