Law will do its job: Minister Komatireddy

చట్టం తన పని తాను చేసుకుపోతుంది: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌: సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదన్నారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎక్స్‌ వేదికగా అన్నారు.

స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి కేసులో నిందితులకు కోర్టు బెయిల్‌ విధించింది. శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి అల్లు అర్జున్‌పై విమర్శలు చేయడం, తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం జరుగుతున్నదని అల్లు అర్జున్‌ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్‌ ఇంటిపై 10 మంది యువకులు దాడి చేశారు. గేట్లను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. అడ్డుకున్న సిబ్బందిని చితకబాదారు. ఆవరణలోని పూలకుండీలను ధ్వంసం చేశారు. అల్లు అర్జున్‌ ఖబర్దార్‌ అంటూ నినాదాలు చేశారు.

అల్లు అర్జున్‌ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చి యువకులను అరెస్ట్‌ చేశారు. అల్లు అరవింద్‌ మేనేజర్‌ కాంతారావు ఫిర్యాదు మేరకు కేసు బీఎన్ఎస్ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఓయూ జేఏసీ నేతలుగా చెప్పుకున్న వారిని చౌటుప్పల్‌కు చెందిన నాగరాజ్‌, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నగేశ్‌, కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన రెడ్డి శ్రీనివాస్‌, మోహన్‌, చర్లపల్లికి చెందిన ప్రేమ్‌కుమార్‌, షాద్‌నగర్‌కు చెందిన ప్రకాశ్‌గా గుర్తించారు.

కాగా, సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందులను వనస్థలిపురంలోని జడ్జి నివాసంలో హాజరుపరిచారు. దీంతో వారికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. రూ.10 వేల చొప్పున ఒక్కొక్కరు రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు.

Related Posts
విశాఖ పోర్టు రికార్డ్
vizag port

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పోర్టు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రవాణా రంగంలో ఒక గొప్ప మైలురాయిని చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి మొత్తం Read more

ఇన్ఫోసిస్ పై కర్ణాటక ప్రభుత్వం చర్యలు
ఇన్ఫోసిస్ పై కర్ణాటక ప్రభుత్వం చర్యలు

ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్‌లో జరుగుతున్న సామూహిక ఉద్యోగుల తొలగింపులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం Read more

IRCTC వెబ్‌సైట్‌లో భారీ అంతరాయం: ప్రయాణీకులకు ఇబ్బందులు
Indian railway

భారతదేశంలో, డిసెంబర్ 26న ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కోఆపరేషన్ (IRCTC) వెబ్‌సైట్ మరియు అప్లికేషన్‌లో భారీ అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా ప్రయాణీకులు తమ Read more

విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల
Central Election Commission

అమరావతి: ఏపీలో విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉపఎన్నికకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల Read more