మహానటి సావిత్రి 90వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో, సంగమం ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
Read Also: Mahanati Savitri: నేడు మహానటి సావిత్రి జయంతి
ఈ సందర్భంగా ఎం. వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) సావిత్రిని స్మరించుకుంటూ ఆమె నటనను కొనియాడారు. “కంటితో కోటి భావాలు, నవరసాలు పలికించగల గొప్ప నటి సావిత్రి. ప్రస్తుతం అలాంటి నటీమణులు లేరని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు” అని ఆయన పేర్కొన్నారు. నేటి సినిమాల్లో కథానాయికల ప్రాధాన్యం తగ్గిపోతోందని, కుటుంబ విలువలతో కూడిన చిత్రాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
“అప్పటి సినిమాల్లో హీరోహీరోయిన్లు ఒకరినొకరు తాకకుండానే శృంగారాన్ని పండించేవారు. ఇప్పుడు తాకినా, గోకినా ఏమీ జరగడం లేదు. అంత తేడా వచ్చేసింది” అంటూ చురక అంటించారు.సినిమా కేవలం వ్యాపారమే కాదని, అదొక కళాత్మక ప్రక్రియ అని దర్శక-నిర్మాతలు గుర్తుంచుకోవాలని సూచించారు.

వినోదంతో పాటు సందేశానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి
‘మహానటి’ చిత్రాన్ని అద్భుతంగా తీశారని చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఇటీవల వచ్చిన ‘బలగం’, ‘35: చిన్న కథ కాదు’, ‘కమిటీ కుర్రాళ్ళు’ వంటి చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయని గుర్తుచేశారు. వినోదంతో పాటు సందేశానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని వెంకయ్యనాయుడు కోరారు. “సందేశాత్మక చిత్రాలు ఎవరు చూస్తారని అనుకోవద్దు.
రామోజీరావు గారు తీసిన సందేశాత్మక సినిమాలు విజయం సాధించలేదా?” అని ప్రశ్నించారు. తెలుగు సాహిత్యంలో ఉన్న గొప్ప కథలను నేటి తరానికి అందించాలని, ఈటీవీ విన్ ‘కథాసుధ’ పేరుతో చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని అన్నారు. సావిత్రి లాంటి నటికి మరణం లేదని, ఆమె ఎప్పటికీ చిరస్మరణీయురాలని నివాళులర్పించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: