మూడు వన్డేల సిరీస్లో భాగంగా శనివారం వైజాగ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో సమష్టిగా రాణించిన టీమిండియా 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది.ఈ విజయంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హర్షం వ్యక్తం చేశారు. వైజాగ్లో ఇదొక అద్భుతమైన క్రికెట్ నైట్ అని ట్వీట్ చేశారు.
Read Also: Virat Kohli: భారత్ విజయం పై విరాట్ ఏమన్నాడంటే?

టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడారని, యశస్వి జైస్వాల్ అజేయంగా 116 పరుగులు చేయడం ప్రశంసనీయమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఇంతకంటే ఎక్కువ కోరుకోలేరని పేర్కొన్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 39.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ (75) శుభారంభం అందించగా, యశస్వి జైస్వాల్ (116 నాటౌట్) అజేయ శతకంతో కదం తొక్కాడు. విరాట్ కోహ్లీ (65 నాటౌట్) కూడా రాణించడంతో భారత్ సునాయాసంగా గెలిచింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: