టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) పర్యాటకులకు, భక్తులకు మరింత సౌకర్యం కల్పించేందుకు,వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి, టీటీడీ కొత్త మార్గదర్శకాలు, విధానాలను అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ నిర్ణయాలు ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగుల కోసం, అలాగే దర్శన టోకెన్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ, భక్తులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
దర్శనంలో మార్పులు
65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులతో పాటు శారీరక, మానసిక వైకల్యం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న భక్తులకు టీటీడీ కోవిడ్ ముందు వరకు రోజుకు 1,400 మందికి దర్శనం అవకాశం కల్పించేవారు.పాత విధానం పునరుద్దరణ వీరికి గతంలో తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉండే కౌంటర్ల ద్వారా ఉదయం 10 గంటల స్లాటుకు 700 మందికి, మధ్యాహ్నం 3 గంటలకు 700 మందికి కరెంట్ బుకింగ్ ద్వారా టోకెన్లు ఇచ్చేవారు. కొవిడ్ నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలతో పాటు ఈ విధానాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత 2021 ఏప్రిల్ 9 నుంచి పునరుద్ధరించారు. కాగా, టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడం, కొవిడ్ సమయంలో పెరుగుతున్న రద్దీ కారణంగా కరెంట్ బుకింగ్‌ను అప్పట్లో రద్దు చేశారు.
ఆఫ్‌లైన్ విధానం
అప్పటి నుంచి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల తరహాలో ఈ టోకెన్లను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలనే నిబంధన పెట్టారు. ఉదయం 10 గంటల స్లాట్‌ను రద్దు చేసి, మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌కు మాత్రమే వెయ్యి టోకెన్లు జారీ చేస్తున్నారు.ఆఫ్ లైన్ లో టోకెన్లు అయితే, ఈ క్రమంలో ఎలాంటి దర్శన టికెట్లు, టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు సర్వదర్శనం క్యూలైన్‌లోకి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీంతో, గత నెల 24న జరిగిన బోర్డు సమావేశంలో ఆఫ్ లైన్ లోనూ టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించారు. కాగా, రానున్న 3 నెలలకు సీనియర్ సిటిజన్ల టోకెన్ల జారీప్రక్రియ ఆన్‌లైన్‌లో పూర్తయ్యింది. ఆ తర్వాత ఆఫ్‌లైన్ విధానం అమలు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ట్రయల్ రన్
రోజుకు ఎన్ని టోకెన్లు ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలనేది ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేయనున్నారు. ఇదే సమయంలో బ్రేక్ దర్శనాల్లోనూ మార్పుల పైన టీటీడీ కసరత్తు చేస్తోంది. గతంలో అమలు చేసిన విధంగా ఉదయం 5.30 గంటల నుంచి ప్రారంభిచేలా రానున్న శని, ఆదివారాల్లో టీటీడీ ట్రయల్ రన్ నిర్వహించనుంది.బ్రేక్ దర్శనాల్లో మార్పు కాగా, రాత్రివేళల్లో కంపార్టుమెంట్లలో వేచిఉండే భక్తులకు ఉదయం దర్శనం చేయించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో వీఐపీ బ్రేక్‌ను ఉదయం 10.30 గంటలకు మార్చారు. ఈ విధానంపై పలువురు వీఐపీల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
పూర్వపుపద్ధతి
ఉదయం కల్యాణోత్సవం, ఉదయం టైంస్లాట్‌లు కలిగిన రూ.300 ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణాలతో వీఐపీ బ్రేక్‌ను తిరిగి పూర్వపుపద్ధతిలో వేకువజాము 5.30 గంటలకే ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 15 నుంచి జూన్ 30వ తేదీ వరకు సిఫార్సు లేఖలపై ఇచ్చే బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది. బుధవారం టీటీడీ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. తిరుమలలో భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనపై నిర్ణయం తీసుకోన్నారు.