laxmi pranathi business

బిజినెస్ రంగంలోకి లక్ష్మీ ప్రణతి..?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతిని బిజినెస్ రంగంలోకి తీసుకురావడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా మీడియా, సామాజిక మాధ్యమాల్లో పెద్దగా కనిపించని లక్ష్మీ ప్రణతికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇదివరకే పలువురు సినీ ప్రముఖుల భార్యలు బిజినెస్ లోకి అడుగుపెట్టి విజయవంతం అవ్వడం చూసిన ఎన్టీఆర్, తన భార్యకు కూడా వ్యాపార ప్రపంచంలో ప్రత్యేక స్థానం కల్పించాలని భావిస్తున్నారని సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్ కి ఎంతటి భారీ ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులకు దగ్గరయ్యేలా ఉండేందుకు ఎన్టీఆర్ ఎప్పుడూ ప్రత్యేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే దిశగా ఆయన తన భార్య లక్ష్మీ ప్రణతిని బిజినెస్ రంగంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ వ్యాపారం ద్వారా ఆయన తన అభిమానులతో మరింత మమేకం కావడంతోపాటు, ఏపీ ప్రజలకు ఉపయోగపడే సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

laxmi pranathi ntr

లక్ష్మీ ప్రణతి ప్రారంభించనున్న వ్యాపారం ఏదైనా సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా ఉండనుందని, అదే సమయంలో ఎన్టీఆర్ అభిమానులకు అతనికి మధ్య సంబంధాన్ని మరింత బలపరిచేలా ఉంటుందని సమాచారం. అయితే ఈ వ్యాపారం ఏ రంగానికి సంబంధించినదో ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని, అందుకు సంబంధించి ఎన్టీఆర్ ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

ఇప్పటికే తన సినీ కెరీర్ లో అగ్రస్థానంలో ఉన్న ఎన్టీఆర్, ఇప్పుడు వ్యాపార రంగంలో తన భార్యకు అవకాశం కల్పించడం వెనుక లాంగ్ టెర్మ్ ప్లాన్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అభిమానులు ఎన్టీఆర్ ను సీఎం పదవిలో చూడాలనే ఆశతో ఉన్న నేపథ్యంలో, ఆయన తీసుకునే ఈ వ్యాపార నిర్ణయం భవిష్యత్ రాజకీయ ప్రవేశానికి అడుగులా మారుతుందా? అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది.

Related Posts
10th Exams : పరీక్షలే జీవితం కాదు.. ఆల్ ది బెస్ట్ – హోంమంత్రి అనిత
SSC Public Exams 2025: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రేపటి నుండి.. విద్యార్థులకు ఇవే ముఖ్య సూచనలు

ఏపీ హోంమంత్రి అనిత పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు సూచనలు చేశారు. పరీక్షలు జీవితంలో కీలకమైనవే కానీ, అవే జీవితం కాదని ఆమె అన్నారు. విద్యార్థులు టెన్షన్ Read more

ట్రాఫిక్ దెబ్బకు మెట్రోలో ప్రయాణించిన బీజేపీ ఎంపీ
etela metro

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సామాన్యుడిగా మారారు. నిత్యం కార్ లలో తిరిగే ఆయన.. తాజాగా హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించి ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో Read more

పర్వతారోహణలో మన దేశం చిన్నారి సరికొత్త రికార్డు
kaamya

కామ్య కార్తికేయన్ అనే 17 ఏళ్ల యువతి, తాజాగా అద్భుతమైన సాహసానికి స్వస్తి పలికింది. ఈ యువతి, రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా మద్దతు పొందిన ఒక ప్రతిభావంతమైన Read more

ఢిల్లీ ఎన్నికల విజయంపై మోదీ ట్వీట్
modi delhi

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం పొందడంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 'జనశక్తి ప్రధానం. అభివృద్ధి, సుపరిపాలనను గెలిపించారు. ఈ చరిత్రాత్మక విజయాన్ని అందించిన ఢిల్లీలోని Read more