లక్ష్మీపార్వతికి ‘గౌరవ ఆచార్య’ హోదా తొలగింపు

వైసీపీ నేత లక్ష్మీపార్వతికి గతంలో కేటాయించిన ఆంధ్ర యూనివర్సిటీ ‘గౌరవ ఆచార్యురాలు’ హోదా ఉపసంహరించుకుంటున్నట్లు వర్సిటీ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ కిశోర్ బాబు తెలిపారు. ఆమెకు ఇప్పటి వరకు వర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదు. గతంలో ఆమె తెలుగు అకాడమి ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో.. యూనివర్సిటీలో పీహెచ్ డీ విద్యార్థులకు గైడ్ గా నియమించారు. తాజాగా ఈ విధుల నుంచి కూడా తప్పించారు.

ఆమె గైడ్‌గా ఉన్న పీహెచ్‌డీ విద్యార్థుల్ని వర్శిటీ తెలుగు విభాగంలో మరొక ప్రొఫెసర్ దగ్గరకు మార్పు చేయాలని ఆదేశించారు. ఆమె వద్ద మార్గదర్శకం కోసం చేరిన రీసెర్చ్ స్కాలర్స్‌ను (పరిశోధకులను) తెలుగు విభాగంలో మరొక ప్రొఫెసర్‌కు (ఆచార్యునికి) మార్పు చేయాలని ఆదేశించామని యూనివర్శిటీ రిజిస్ట్రార్ కిశోర్ బాబు వెల్లడించారు.