laggam movie pre release event 2

Laggam movie తెలంగాణ బిడ్డగా నటించడం అదృష్టం

సాయి రోనక్ ప్రగ్యా నగ్రా జంటగా ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్ రోహిణి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘లగ్గం’ ఈ సినిమాకు రమేష్ చెప్పాల దర్శకత్వం వహించారు వేణుగోపాల్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు ఈ చిత్రం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ “ఇది తండ్రీ కూతుర్ల మధ్య భావోద్వేగాల కథ గతంలో నేను నటించిన ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రానికి రమేష్ రచయితగా పనిచేశాడు అప్పటినుంచి నా అనుబంధం ఉంది ఈ చిత్రంలో తెలంగాణ యాసలో నటించడం నా అదృష్టం కంటెంట్ మీద నాకు ఎంత నమ్మకం ఉందో విడుదలకు ముందే నిర్మాతను అభినందిస్తున్నా ” అని తెలిపారు.

దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ “తెలంగాణ నేపథ్యంలో ఉండే బలమైన కథను అందరికీ చేరవేయాలని ప్రయత్నించాను ఈ కథ అందరికీ చెందేలా ఉంటుందని విశ్వసిస్తున్నాను ఈ సినిమా అరిటాకులో వడ్డించిన విందు భోజనం లాగా ఉంటుంది అందరికీ తీపి అనుభూతిని ఇస్తుంది ” అని అన్నారు నిర్మాత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ “సినిమా ద్వారా ఒక మంచి సందేశాన్ని అందంగా చెప్పాం ” అని తెలిపారు హీరో హీరోయిన్లతో పాటు ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు సప్తగిరి కృష్ణుడు వడ్లమాని శ్రీనివాస్ సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ పాల్గొన్నారు.

    Related Posts
    మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2’ ఫస్ట్ లుక్ పోస్టర్
    Chaitu Jonnalagadda

    ప్రముఖ నటుడు సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం MM పార్ట్-2 ప్రస్తుతం అతి పెద్ద అంచనాలతో ముందుకు సాగుతోంది. ఈ చిత్రం Read more

    అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పరిగణించబడుతోంది
    mahesh babu ssmb 29

    మహేష్ బాబు అభిమానులను ఆకర్షించేలా ఆయన తాజా చిత్రం SSMB 29 భారీ అంచనాల నడుమ మైఖేల్ జోర్డాన్ డైరెక్షన్‌లో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్‌ను ఒక విజన్‌గా Read more

    సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి పై స్పందించిన ఎన్టీఆర్
    సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి పై స్పందించిన ఎన్టీఆర్

    బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి ఘటనకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.అర్ధరాత్రి సమయంలో సైఫ్ ఇంట్లోకి చొరబడిన దొంగ, అక్కడ ఉన్న పనిమనిషిపై Read more

    ఓటీటీలో సూపర్ హిట్..బిగ్ స్క్రీన్ పై రానున్న 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్
    ఓటీటీలో సూపర్ హిట్..బిగ్ స్క్రీన్ పై రానున్న మూవీ

    ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో దుమ్మురేపిన సూపర్ హిట్ కంటెంట్‌ను ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూపించేందుకు మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. డిజిటల్‌లో భారీ విజయాన్ని సాధించిన ప్రాజెక్ట్స్‌ను వెండితెరపై Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *