Lagacharla incident. Accused in police custody for two days

లగచర్ల ఘటన.. నిందితుడికి రెండు రోజుల పోలీస్ కస్టడీల

హైదరాబాద్‌: కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటునకు వ్యతిరేకంగా అక్కడి గ్రామస్తులు వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడికి యత్నించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు బోగమోని సురేష్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు రెండు రోజుల కస్టడీ విధించింది. పోలీసులు వారం రోజుల కస్టడీ కోరగా.. కోర్టు మాత్రం రెండు రోజుల కస్టడికి అనుమతించింది.

దీంతో పరిగి పీఎస్‌లో సురేష్‌ను ఈరోజు, బుధవారం పలు అంశాలపై ప్రశ్నించనున్నారు. లగచర్ల దాడి కేసులో ఏ1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి, సురేష్‌కు మధ్య ఉన్న సంబంధాలు, దాడి సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు..చర్చలు ఏమిటన్న దానిపై పోలీసులు సురేష్‌ను ప్రశ్నించనున్నారు. మణికొండలో నివాసముండే సురేష్ లగచర్లకు ఎందుకు రాకపోకలు సాగించారు. దాడిలో గిరిజనులను ఎందుకు రెచ్చగొట్టారు, దానివెనుకున్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

Related Posts
ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేమిరెడ్డి దంపతులు భేటి
Vemireddy couple meet CM Chandrababu

అమరావతి: సీఎం చంద్రబాబును నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలిశారు. ఈ మేరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన వేమిరెడ్డి Read more

ఎన్నికల ముందు ఓ మాట.. ఎన్నికలలో గెలిచాక ఓ మాట: కవిత
Mlc kavitha comments on cm revanth reddy

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం Read more

తమిళనాడులో భారీ వర్షాలు: పాఠశాలలు, కళాశాలలకు సెలవు
Schools Closed Rainfall

తాజా సమాచారం ప్రకారం, పుదుచ్చేరీ మరియు కరైకల్ ప్రాంతాలలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ సహాయం పొందిన పాఠశాలలు మరియు కళాశాలలకు నవంబర్ 27, 2024 న Read more

కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌తో ఎంపీ ఈటల రాజేందర్ భేటి
MP Etela Rajender met with Union Railway Minister Ashwini Vaishnav

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌ను బీజేపీ కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఢిల్లీలోని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *