Kumbh Mela is over.. More than 66 crore people took holy bath

ముగిసిన కుంభ మేళా.. 66 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు..

చివరి రోజూ ప్రయాగ్‌రాజ్‌కు భక్తుల వరద

ప్రయాగ్‌రాజ్‌: ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభ మేళా శివరాత్రి పర్వదినమైన బుధవారం వైభవంగా ముగిసింది. ప్రజల భక్తి, ఐక్యత, సామరస్యాల సంగమంగా నిలిచిన ఈ వేడుకకు త్రివేణి సంగమం సాక్షిగా నిలిచింది. జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు జరిగిన ఈ మేళాలో 66.21 కోట్ల మందికి పైగా పాల్గొని పుణ్య స్నానాలు చేయగా, ఆఖరి రోజు1.44 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్టు అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ఇది రికార్డులకెక్కింది. దేశ, విదేశీ ప్రముఖులు ఈ కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేశారు. ఈ కుంభమేళాకు ప్రత్యక్షంగా హాజరు కాని భక్తులకు డిజిటల్‌ ఫొటో స్నానం చేయించడం విశేషం.

Advertisements
ముగిసిన కుంభ మేళా 66 కోట్ల

144 ఏండ్లకు కుంభమేళానా.. వాస్తవమెంత?

మహా కుంభమేళా 144 ఏండ్లకు ఒకసారి వస్తుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత ఉందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఇటీవల కుంభమేళాలో జరుగుతున్న ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె 144 ఏండ్లకు ఒకసారి మహా కుంభమేళా జరుగుతుందని వేసిన అంచనాను ప్రశ్నించారు. మతా బెనర్జీ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బీజేపీ విమర్శించింది.

హిందూ ఓటర్లూ.. రాహుల్‌ను బహిష్కరించండి

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విచ్చేసిన హిందూ మహా ఉత్సవం మహా కుంభ మేళాను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్‌ ఠాక్రే సందర్శించకుండా హిందువులను అవమానించారని కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే విమర్శించారు. వీరిని హిందూ ఓటర్లు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కోట్లాది హిందువుల మనోభావాలను గౌరవించి రాహుల్‌, ఠాక్రే కుటుంబాలు ఇందులో పాల్గొనాలని, కాని వారు దానికి గైర్హాజరై హిందువులను అవమానపరిచారని విమర్శించారు.

Related Posts
జనాభాలో దూసుకెళ్తున్న హైదరాబాద్
జనాభాలో దూసుకెళ్తున్న హైదరాబాద్

హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్‌లో సెటిల్ అవుతున్నారు. Read more

హస్తినను హస్తగతం చేసుకునేది ఎవరు?
elections

దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని Read more

తొలిసారి భారత్ లో పర్యటించబోతున్న US ఇంటెలిజెన్స్ చీఫ్
US intelligence chief

అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ తొలిసారి భారతదేశాన్ని సందర్శించనున్నారు. నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ఆమె తొలి గమ్యస్థలం జపాన్. అక్కడ కీలక చర్చలు ముగించుకున్న Read more

టీమిండియా గెలుపుపై ష‌మా మ‌హమ్మ‌ద్ స్పందన
టీమిండియా గెలుపుపై ష‌మా మ‌హమ్మ‌ద్ స్పందన

మంగళవారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి, గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో Read more

×