హైదరాబాద్‌ అభివృద్ధిపై కేటీఆర్‌ కీలక పోస్ట్‌..

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్..హైదరాబాద్‌ అభివృద్ధిపై సంచలన పోస్ట్‌ పెట్టారు. SRDP ద్వారా హైదరాబాద్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం 42 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించింది. వీటిలో 36 విజయవంతంగా పూర్తి చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మిగిలిన ప్రాజెక్టులను కూడా 2024లో పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కొనసాగుతున్న SRDP పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహించారు. గత 8 నెలలుగా సరైన పర్యవేక్షణ లేక సకాలంలో చెల్లింపులు లేవని నిప్పులు చెరిగారు. SRDP మూడవ దశ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ ఫేజ్-3 ప‌నుల్లో మూసీ వెంబ‌డి ఎక్స్‌ప్రెస్‌వే, కేబీఆర్ పార్క్ కింద ట‌న్నెల్స్ నిర్మాణం, ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్‌పాస్‌లు, ఇత‌ర అనేక గ్రేడ్‌సెప‌రేటర్లు ఉన్నాయ‌న్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.