నేత‌న్న‌ల‌వి ఆత్మ‌హ‌త్య‌లు కాదు.. ముమ్మాటికీ ప్ర‌భుత్వ హ‌త్య‌లే – కేటీఆర్

రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న నేత‌న్న‌ల‌వి ఆత్మ‌హ‌త్య‌లు కాదు.. అవి ముమ్మాటికీ ప్ర‌భుత్వ హ‌త్య‌లే అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇప్పటిదాకా 10 మంది నేతన్నలు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఈ పది ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలే అని కేటీఆర్ పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రెేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు పోతున్న పట్టింపు లేదా? అని ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

తెలంగాణలో పదేళ్ల తరువాత మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయ‌ని, మ‌ళ్లీ సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభం త‌లెత్తింద‌న్నారు. గత ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను, నేతన్నలకు ఆర్డర్లను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆపేసింద‌ని కేటీఆర్ గుర్తు చేశారు. గతంలో అందిన ప్రతి కార్యక్రమాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి. కేవలం గత ప్రభుత్వంపై కక్షతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టవద్దు. గతంలో నేతన్నలకు తమ పార్టీ, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బ‌హిరంగ లేఖ రాశారు.