చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధాని మోడీ – కేటీఆర్

చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధాని మోడీనే అంటూ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సోమవారం మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చేనేత కార్మికులతో కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి ఫై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధాని మోడీ అని , చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలుమోడీ ప్రభుత్వం రద్దు చేసిందని ధ్వజమెత్తారు. పొదుపు, బీమా పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలను బీజేపీ రద్దు చేసిందన్నారు. చేనేత కార్మికులు ఉప ఎన్నికల్లో ఓటుతో బీజేపీకి బుద్ధి చెప్పాలని సూచించారు.

ఇక మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈరోజు తో ముగిసింది. ఈ ఉప ఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు 190 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 47 మంది నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. మిగిలిన 83 మందిలో 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తంగా ఉప ఎన్నిక బరిలో 47 మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.