రేవంత్ ‘కంప్యూటర్’ కామెంట్స్ ఫై KTR సెటైర్లు..

కంప్యూటర్‌ను పుట్టించిందే మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సెటైర్లు వేశారు. ‘కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ కాదు చార్లెస్ బాబేజీ. దేశానికి కంప్యూటర్ పరిచయం చేసిందీ రాజీవ్ కాదు. TIFRAC వారు 1956లో ఇక్కడ కంప్యూటర్ సేవలు ప్రారంభించారు. రాజీవ్ కు అప్పటికి 12ఏళ్లు. నోటికొచ్చింది వాగి దొరికిపోవడం ఎందుకు? నీకు బాగా తెలిసిన రియల్టీ దందాలు, బ్లాక్ మెయిల్కి పరిమితమైతే మంచిదమ్మా చిట్టి’ అని ట్వీట్ చేశారు.

సచివాలయం ఎదుట ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంప్యూటర్‌ను పుట్టించిందే మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ అని పేర్కొన్నారు. సెల్‌ఫోన్లు, కంప్యూటర్‌ను మన దేశానికి పరిచయం చేసింది ఆయనే అని, దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్‌గాంధీకే దక్కుతుందని చెప్పారు. గాంధీల కుటుంబానిది త్యాగాల చరిత్ర అంటూ కొనియాడారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.