‘CBN రూ. లక్ష కోట్లు డిమాండ్’ ప్రచారంపై స్పందించిన KTR

ఏపీ అభివృద్ధికి లక్ష కోట్లు ఆర్థిక సాయం ఇవ్వాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పందించారు. ఢిల్లీలో అనుకున్నది సాధించాలంటే ప్రాంతీయ పార్టీలకు ఓటు వేయాలనేది ఇందుకే అని అన్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఆశిస్తున్నానన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అంటూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో బిఆర్ఎస్ vs కాంగ్రెస్ వార్ నడుస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అలాగే నిరుద్యోగుల డిమాండ్స్ ఫై గళం విప్పుతుంది. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య మాటల వార్ నడుస్తుంది. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్‌ సరార్‌, ఇప్పుడు నిధుల సమీకరణ కోసం ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నదని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన రూ.20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు, దీనికి మధ్యవర్తిగా ఒక మర్చంట్‌ బ్యాంకర్‌ను పెట్టి వారికి రూ.100 కోట్ల కమీషన్‌ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు మీడియాలో వస్తున్న కథనాలను కోట్‌ చేస్తూ ఆయన బుధవారం ఎక్స్‌లో పోస్ట్‌చేశారు.