ప్రజలతో ఏర్పడిన గ్యాప్ కారణంగానే ఓడిపోయాం – కేటీఆర్

ఎన్నికల్లో ఓటమికి కారణం ప్రజలతో ఏర్పడిన గ్యాప్ అన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్. తాము అభివృద్దిని ప్రజలకు చెప్పుకోలేకనే ఓడిపోయమని , ఇదే సమయంలో కాంగ్రెస్ అబ్బద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, మా ఓటమికి ప్రజలను తప్పు బట్టం లేదని తప్పు మేమే తప్పు చేశామని చెప్పుకొచ్చారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్.. పార్టీలో తెలంగాణ పేరు మార్చడం వల్ల ఓడిపోయాం అనడానికి ఆధారం లేదన్నారు. హైదరాబాద్ లో అన్ని సీట్లు గెలిచామని, చేసిన అభివృద్ధిని మేము చెప్పుకోలేకపోయామన్నారు. మాకు అహంకారం ఉందని కృత్రిమ ప్రచారం సృష్టించారని ఆత్మవిశ్వాసం, అహంకారానికి తేడా తెలియదన్నారు. అభివృద్ధిలో మాతో పోటీ పడలేనివారే అహంకారం అని ప్రచారం చేశారన్నారు.

ఇక పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఫిరాయింపుల వల్ల మాకు లాభం ఏమి జరగలేదని, ఎమ్మెల్యేలను చేర్చుకుని నష్టపోయామని ఎమ్మెల్యే హరీశ్ రావు ఈ సందర్భంగా చెప్పారు. మా పార్టీలో చేరిన వాళ్ళల్లో పది మంది ఓడిపోయారని చెప్పారు. తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారన్నారు.