పుట్టినరోజున సందర్బంగా తన గొప్ప మనసు చాటుకున్న కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా తన మంచి మనసు చాటుకున్నారు. స్టేట్ హోమ్ ఉన్న విద్యార్థినులతో బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో స్టేట్ హోంలోని 100 మంది విద్యార్థినుల‌కు ల్యాప్‌టాప్‌లు అంద‌జేశారు కేటీఆర్. దీంతో విద్యార్థినులంతా సంతోషం వ్య‌క్తం చేశారు. అలాగే ఆత్మ‌హ‌త్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాల‌కు కూడా కేటీఆర్ ఆర్థిక సాయం అంద‌జేశారు.

2020 లో కరోనా సమయంలో కేటీఆర్ తన బర్త్ డే వేడుకలను ఇతరులకు సాయం చేసే విధంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తనతో పాటు తన శ్రేయోభిలాషులు, అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

గత ఐదేళ్లలో పలు అంబులెన్స్ లతో 6,000 మంది విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా టాబ్లెట్ పరికరాలను అందజేశారు. 1400 మంది దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్లను అందించినట్లు కేటీఆర్ తెలిపారు. గత ఏడాది తన జన్మదినం సందర్భంగానే స్టేట్ హోమ్ విద్యార్థులకు లాప్ టాప్ లు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని కానీ ఎన్నికల వలన అది సాధ్యం కాలేదని..ఇప్పుడు ఆ కోరిక నెరవేరిందన్నారు.

బుధువారం సాయంత్రం తన పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ త‌న‌ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. బుధవారం నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్‌ను, శోభమ్మను త‌న సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి కేటీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ‘నూరేళ్లు వర్థిల్లూ’ అంటూ కేటీఆర్‌ను కేసీఆర్ దీవించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.