ACB notices to KTR once again..!

పైసా పనిలేదు.. రూపాయి లాభం లేదు: రేవంత్‌ ఢిల్లీ టూర్లపై కేటీఆర్‌ సెటైర్లు

హైదరాబాద్: సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు సంధించారు. పది నెలల్లో 25 సార్లు, 50 రోజులు ఢిల్లీకి పోయివస్తివి అంటూ ధ్వజమెత్తారు. పోను 25 సార్లు, రాను 25 సార్లు.. నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్‌జూబ్లీ కూడా చేస్తివని ఎద్దేవా చేశారు. తట్టా మట్టి తీసింది లేదు, కొత్తగా చేసింది అసలే లేదంటూ విమర్శించారు. అన్నదాతలు అరిగోసలు పడుతున్నారని, గురుకులాలు గాల్లో దీపాల్లా మారాయని, వైద్యం కుంటుపడిందని, విద్యావ్యవస్థ గాడి తప్పిందన్నారు.

మూసి, హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టారని, 420 హామీలను మడతపెట్టి మూలకు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగలు పండగళ్లా లేవని, ఆడబిడ్డలకు చీరలు అందనేలేవని, అవ్వాతాతలు అనుకున్న పింఛను, తులం బంగారం జాడే లేదని ఫైరయ్యారు. స్కూటీలు, కుట్టు మిషిన్లు లేనేలేవని, అయినా ఢిల్లీకి పోయిరావాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు.

Related Posts
వారం పాటు గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ మూసివేత..ఎందుకంటే..!!
gachibowli flyover closed

హైదరాబాద్‌లోని వాహనదారులకు హెచ్చరిక. ట్రాఫిక్ అధికారులు గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజుల పాటు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు Read more

“పరీక్షా పే చర్చ” ఈసారి ప్రధానితో పాటు సెలబ్రిటీలు..
Pariksha Pe charcha This time celebrities along with Prime Minister

న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న "పరీక్షా పే చర్చ" ఈ ఏడాది కొత్త ఫార్మాట్‌లో జరగనుంది. అయితే మోడీతో Read more

వామ్మో.. మేక ఖరీదు అన్ని లక్షలా..? ఏంటో అంత ప్రత్యేకం
Goat Kid Sold In 14 lakh Ru

ఏంటీ ధర చూసి అవాక్కయ్యారా? ఇది మామూలు మేక కాదు మరి. అసాధారణమైన పొడవాటి చెవులు వంటి ప్రత్యేక లక్షణాలకు ఈ మేక ప్రసిద్ధి చెందింది. దీని Read more

బీసీలకు 42 శాతం రిజర్వేషన్: ఎంఎల్సీ కవిత
mlc kavitha

ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో వెనుకబడిన తరగతులకు కోటా సాధించడానికి తీసుకోవాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై బీసీ సంఘాల నాయకులు మరియు తెలంగాణ జాగృతి చర్చించారుహైదరాబాద్: రాష్ట్రంలోని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *