రేవంత్ రెడ్డి..నీ కపట ప్రేమ.. అసలు రంగు అందరికి తెలుసు – కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి ఫై మరోసారి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. సోనియాగాంధీని దెయ్యం, పిశాచి, బలి దేవత అని అన్న నువ్వా రాజీవ్‌ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది అని విమర్శించారు. దొడ్డి దారిన పీసీసీ ప్రెసిడెంట్‌ అయ్యి ఈరోజు రాజీవ్‌గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలు రంగు అందరికీ తెలుసని ఆగ్రహం వ్యక్తం చేసారు.

తెలంగాణ తల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్‌ నాయకుల విగ్రహాలు ఏంటని అడిగితే కారుకూతలు కూస్తావా అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే అని విరుచుకుపడ్డారు. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటది అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు అక్కరకు రాని వాళ్ల బొమ్మలను తొలగిస్తాం అని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని మళ్లీ చెబుతున్నాం.. రాసి పెట్టుకో అని రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తామని స్పష్టం చేశారు.