తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లాభం – KTR

ktr

తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తే తమకే లాభం అని అన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి గా 4 వ సారి బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు..రీసెంట్ గా హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ కు రావడం తో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ..రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు లాంటివని , తెలంగాణ లో టీడీపీ కి పూర్వ వైభవం తీసుకొస్తామని , మళ్లీ టీడీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేసారు. చంద్రబాబు మాటల తర్వాత చాలామంది ఏపీలో ఎలాగైతే టీడీపీ , జనసేన , బిజెపి పార్టీలు కూటమి గా ఏర్పడ్డాయో..తెలంగాణ లో కూడా అలాగే ఏర్పడతాయి కావొచ్చు అని భావిస్తున్నారు.

ఇదే విషయమై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మంగళవారం ఢిల్లీలో మీడియా తో మాట్లాడిన ఆయన చంద్రబాబు కామెంట్స్ ఫై రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తే తమకే లాభం అని కేటీఆర్ అన్నారు. ‘మేం ఏపీలో బిఆర్ఎస్ పెట్టినప్పుడు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని చంద్రబాబు చెప్పడంలో తప్పేముంది..? అని అన్నారు. తెలంగాణ లో టీడీపీ బలపడితే మాకే లాభం. చంద్రబాబు NDAలో కీలకంగా ఉన్నారు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు తేవాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.