ktr comments on cm revanth reddy

ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం: కేటీఆర్‌

హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కొత్త నాటకం మొదలు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా రేవంత్ వైఖరీ ఉందని ఆక్షేపించారు. తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి- ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్విట్ చేశారు.

Advertisements
image
image

‘‘తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన – ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేశి. ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరికి ? -గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఎవరికి ? నెలకు రూ.2500 ఇస్తున్న మహిళలు ఎవరు ? – తులం బంగారం ఇచ్చిన ఆడబిడ్డలు ఎవరు..? రైతుభరోసా రూ.7500 ఇచ్చిందెక్కడ.. ? – ఆసరా ఫించన్లు రూ.4000 చేసిందెక్కడ..? రూ.5 లక్షల విద్యాభరోసా ఎక్కడ..? విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఎక్కడ..? పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా ఇక్కడ హామీలకు దిక్కులేదు గాని అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నారు. ఈడ ఇచ్చిన హామీలకు దిక్కు లేదు.. ఢిల్లీలో ఇస్తున్న హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా..? ఢిల్లీ గల్లీల్లో కాదు దమ్ముంటే మీ ఢిల్లీ గులాంతో అశోక్‌నగర్ గల్లీల్లో చెప్పు ఉద్యోగాలు ఇచ్చామని నవ్విపోదురు గాక .. నాకేంటి సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహారం’’ అని కేటీఆర్ విమర్శించారు.

Related Posts
TTDలో ప్రక్షాళన చేస్తాం – BR నాయుడు
టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు

TTD (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్‌గా నియమితులైన బొల్లినేని రాజగోపాల్ నాయుడు, తన నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ Read more

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
Cabinet meeting concludes.. Approval of several key issues

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన Read more

Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతుండగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనకు మంత్రి పదవి ఖాయమని, కాంగ్రెస్ Read more

ఛత్తీస్‌గఢ్‌లో అమిత్‌ షా పర్యటన
Amit Shah's visit to Chhattisgarh

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిసెంబర్ 13 నుండి 15 వరకు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమిత్‌ షా నక్సలిజం వ్యతిరేక కార్యాచరణకు సంబంధించి Read more

×