ktr revanth

రేవంత్ స‌ర్కార్‌పై కేటీఆర్ ఫైర్

ప్ర‌భుత్వ‌, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప‌ట్ల నిర్ల‌క్ష్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామ‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్న రేవంత్ స‌ర్కార్‌కు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది క‌నిపించ‌డం లేదా..? అని కేటీఆర్ నిలదీస్తూ ట్విట్ చేసారు.

దండ‌గ‌మారి పాల‌న‌లో పండుగ పూట కూడా ప‌స్తులు ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని , కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఐదారు నెలలుగా జీతాల్లేవ్ అని తెలిపారు. పంచాయతీ వర్కర్స్, మున్సిపాలిటీ కార్మికులు, ఆసుపత్రి సిబ్బంది, హాస్టల్ వర్కర్స్, గెస్ట్ లెక్చరర్స్.. ఇలా ప్రతీ శాఖలో వేతనాల్లేక చిరుద్యోగులు విలవిల‌లాడిపోతున్నార‌ని, చిరుద్యోగులు కుటుంబాలను నెట్టుకురావడానికి అప్పులు చేసి నానా తిప్పలు పడుతున్నారని కేటీఆర్ తెలిపారు. ఒకటో తారీఖునే జీతాలు ఇస్తామని పలికిన ప్రగల్భాలు ఎటుబాయె..? దసరా దగ్గరికి వచ్చింది..సరుకులు కొనడానికి చేతిలో నయాపైసా లేదు..! నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో డితే బతుకు బండి నడిచేదెట్లా..? 10 నెలల్లో తెచ్చిన రూ. 80 వేల కోట్లు అప్పులు ఎక్కడికి పోయినయ్..? చిరుద్యోగులు.. చిన్నజీతాల కార్మికుల అవస్థలను పట్టించుకోండి..వెంటనే వేతనాలు చెల్లించండి అని రేవంత్ స‌ర్కార్‌ను కేటీఆర్ డిమాండ్ చేశారు.

Related Posts
విజయ్ మొదటి పోరాటం రైతులకు మద్దతు
విజయ్ మొదటి పోరాటం రైతులకు మద్దతు

విజయ్, రాజకీయాల్లోకి రాగా, ప్రజా సమస్యలపై తన పోరాటాన్ని ప్రారంభించారు.ప్రజాసమస్యలపై పోరాడతామని ఆయన ఇటీవల ప్రకటించారు. రైతులకు అన్యాయం చేయవద్దని, అభివృద్ధి పేరుతో రైతుల భూములను ఎత్తేయొద్దని Read more

అత్యాచారం కేసు..ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్‌ తిరస్కరణ
Rape case.Prajwal Revanna bail petition rejected

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ప్రజ్వల్ రేవణ్ణకు ఈరోజు సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదురుకుంటున్న Read more

గ్రామస్థాయి ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
cm revanth ryathu sabha

తెలంగాణలో గ్రామస్థాయి ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. జీతాలు క్రమం తప్పకుండా చెల్లించేందుకు అధికారులను ఆయన ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు Read more

ఆప్ వెనుకంజకి ప్రధాన కారణాలు ఏంటి?
ఆప్ వెనుకంజకి ప్రధాన కారణాలు ఏంటి?

ఢిల్లీలో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భారీ ఎదురుదెబ్బ ఎదుర్కొంది. గత ఎన్నికల్లో బీజేపీని సింగిల్ డిజిట్ స్కోర్‌కు పరిమితం చేసిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *