పవన్ కళ్యాణ్ OSDగా యువ ఐఏఎస్

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓఎస్‌డీగా కేరళ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి కృష్ణతేజ నియమితులు కానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతిచ్చారు. కృష్ణతేజ స్వస్థలం పల్నాడు జిల్లా చిలకలూరిపేట. ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. సాధారణంగా ఆర్‌డీఓ స్థాయి అధికారులను మంత్రులకు ఓఎస్‌డీలుగా నియమిస్తారు. కానీ పవన్ కల్యాణ్ కోసం ఐఏఎస్ అధికారి అయిన కృష్ణ తేజ నియామకానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ఆయనను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

కృష్ణతేజ గతంలో కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, పర్యాటకశాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు. కాగా, రెండు రోజుల క్రితం కృష్ణతేజ సచివాలయంలో పవన్ కల్యాణ్‌ను కలిసి వెళ్లారు. కృష్ణతేజ 2015 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి.. ఆయన గతంలో కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, పర్యాటకశాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా కూడా పనిచేశారు. కరోనా సమయంలో, ఆ తర్వాత ఎంతోమందికి చేయూతను అందించారు.. కరోనా కారణంతో తల్లిదండ్రులను కోల్పోయిన 609 మంది విద్యార్థులను గుర్తించి.. వారందరికి దాతల సహకారంతో ఉన్నత చదువుకు సాయం అందించారు. అలాగే కరోనా కారణంగా భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇళ్లు నిర్మించడంతో పాటుగా 150మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు.