WhatsApp Image 2025 02 05 at 17.26.53 bec2c29b

సచివాలయంలో హ్యామ్ రోడ్లపై ఆర్ & బీ అధికారులతో జరిగిన రివ్యూలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్

ప్రెస్ నోట్-05.02.2025

సచివాలయంలో హ్యామ్ (హైబ్రిడ్ అన్యూటీ మోడ్) రోడ్లపై ఆర్ & బీ అధికారులతో జరిగిన రివ్యూలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్

  • రాష్ట్రంలో హైబ్రీడ్ అన్యూటీ మోడ్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించిన – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
  • నియమ, నిబంధనలకు అనుగుణంగా హ్యామ్ రోడ్ల నిర్మాణం చేయాలని అధికారులకు సూచించిన మంత్రి
  • మండలం నుంచి జిల్లా కేంద్రానికి మిస్సింగ్ లింక్ రోడ్లు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి మిస్సింగ్ లింక్ రోడ్ల, అప్ గ్రేడేషన్ వంటి మూడు విభాగాలుగా నిర్మాణం
  • హ్యామ్ రోడ్ల నిర్మాణంలో కన్సల్టెంట్లను గుర్తించి, డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశం.
  • మంచిగా ఉన్న రోడ్లను హ్యామ్ లోకి తీసుకువస్తే కన్సల్టెంట్లే బాగుపడుతరు కాబట్టి, అధికారులు హ్యామ్ రోడ్లను గుర్తించే క్రమంలో.. అత్యంత దారుణంగా ఉండి, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న రోడ్లకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్ధేశం
  • రోడ్ల నిర్మాణంలో డివైడర్లు, లైంటింగ్, రోడ్డు విస్తరణ, పేవ్ డ్ షోల్డర్స్ ఏర్పాటులో ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటించేలా పకడ్భందీగా వ్యవహరించాలని తేల్చిచెప్పిన మంత్రి.
  • 15 ఏండ్ల పాటు హ్యామ్ రోడ్డు తీసుకున్న సంస్థే పూర్తిగా మొయింటినెన్స్ చేయాల్సి ఉన్నందున రోడ్డు నాణ్యతలో రాజీపడకుండా ఉండేలే ప్రతీ ఇంజనీర్ జాగ్రత్తగా పనులను తనిఖీ చేయాలని సూచించిన మంత్రి.
  • ఇప్పటి వరకు మట్టి రోడ్డుగా ఉన్న రోడ్లను గుర్తిస్తే.. తన దృష్టికి తీసుకువస్తే వెంటనే మంజూరీ చేస్తానని అధికారులకు చెప్పిన ఇచ్చిన మంత్రి.
  • అటవీ అనుమతులతో మట్టిరోడ్లుగా ఉన్న రహదారులను భవిష్యత్తులో బీటీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించిన మంత్రి.
  • ప్రజాధనంతో నిర్మిస్తున్న రహదారుల నిర్మాణంలో ఎక్కడా రాజీలేదని.. నాణ్యతలేని పనులు చేస్తే వెంటనే పనులను రద్ధు చేస్తామని హెచ్చరించిన మంత్రి.
  • హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు సమయం కావాలని అడిగిన కన్సల్టెంట్ల అభిప్రాయాలను తోసిపుచ్చిన మంత్రి.. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సంవత్సరం సమయం తీసుకుంటే ప్రమాదాల్లో చనిపోతే ఏవరు బాధ్యత వహిస్తారని నిలదీసిన మంత్రి.
  • ఏ రోడ్డు నిర్మాణమైన రెండు, మూడు నెలల్లో ప్రారంభించేలా వేగంగా ముందుకు వెళ్లాలని ఆర్డర్. హ్యామ్ రోడ్ల మంజూరీ రాష్ట్ర పరిధిలోనే ఉన్నందును ఆర్ & బీ డిపార్ట్ మెంట్ వేగంగా అనుమతులు మంజూరీ చేస్తుందని.. కాబట్టి వెంటనే సర్వే, టెండర్ పూర్వ పనులను ప్రారంభించాలని ఆదేశం
  • జిల్లా కలెక్టర్ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయలను తీసుకోని ఎస్.ఈ., ఈఈ తో పాటు ఇతర అధికారులను కలుపుకొని హ్యామ్ రోడ్ల ను ఎంపిక చేసే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
  • వర్షాలు, దశాబ్ధ కాలంగా మరమ్మత్తులకు నోచుకోని రహదారులను తక్షణమే ఎస్టిమేట్స్ సిద్ధం చేసి షార్ట్ టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించాలన్నారు.
  • ఇప్పటి వరకు 82 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు గుర్తించిన 1690.26 కిలోమీటర్ల రోడ్ల రిపేర్ల పనులను వెంటనే ప్రారంభించేలా టెండర్ పూర్వప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు మార్గనిర్ధేషణం చేశారు.
  • సర్వీస్ రూల్స్ ప్రక్రియ పూర్తి చేసి ఇప్పటికే ఏఈఈ లను డీఈఈలుగా ప్రమోషన్లు ఇచ్చామని, ఈ నెలాఖరుకల్లా డీఈఈ, ఈఈ, ఎస్ఈ లకు ప్రమోషన్లు ఇచ్చే విధంగా కసరత్తు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
  • ఈ రివ్యూలో ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ శ్రీమతి దాసరి హరిచందన, సీఈ (అడ్మిన్) తిరుమల, సీఈ (స్టేట్ రోడ్స్) మోహన్ నాయక్, వివిధ జిల్లాల ఎస్ఈ లు, ఈఈ లు ఇతర అధికారులు.
Related Posts
ఈ నెలాఖరుకే గ్రూప్స్ ఫలితాలు?
group 2 results

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాల విడుదలకు సంబంధించి టీఎల్పీఎస్సీ (TGPSC) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాజా వివరాల ప్రకారం, ఈనెలాఖరులోగా ఫలితాలను Read more

రేషన్ కార్డులపై ఎలాంటి ఆదేశాలివ్వలేదు – ఈసీ
telangana ration cards

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ వేశారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) దీనిపై స్పష్టతనిచ్చింది. రేషన్ కార్డుల జారీని నిలిపివేయాలని Read more

టన్నెల్ ప్రమాదం.. ఏడుగురి కోసం గాలింపు!
514579 tunnel

శ్రీశైలం ఎడమ కాలువలోని SLBC టన్నెల్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ పైకప్పు అకస్మాత్తుగా కూలిపోవడంతో 50 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ఈ Read more

ఫార్ములా-ఈ కేసు..లొట్టపీసు కేసు – కేటీఆర్
KTR e race case

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇటీవల ఫార్ములా-ఈ-కార్ కేసులో ఢిల్లీ ఈడీ నుంచి నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ నోటీసులపై ఆయన తీవ్రంగా Read more