Kodali Nani కొడాలి నానికి హార్ట్ సర్జరీ పూర్తి

Kodali Nani : కొడాలి నానికి హార్ట్ సర్జరీ పూర్తి

మాజీ మంత్రి కొడాలి నాని ముంబయిలోని ఏషియన్ హార్ట్ హాస్పిటల్‌లో గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో ఆయన మరో మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటారని తెలిసింది.గత వారం రోజులుగా కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా, గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.

Advertisements
Kodali Nani కొడాలి నానికి హార్ట్ సర్జరీ పూర్తి
Kodali Nani కొడాలి నానికి హార్ట్ సర్జరీ పూర్తి

హృదయంలోని మూడు వాల్వ్‌లలో సమస్యలు ఉన్నాయని నిర్ధారణ కావడంతో, స్టంట్ లేదా బైపాస్ సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు.మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయనను ముంబయికి తరలించారు.ఈ క్రమంలోనే ఈరోజు ముంబయిలోని ఏషియన్ హార్ట్ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స జరిగింది. ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా నేతృత్వంలోని వైద్య బృందం దాదాపు 10 గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యంగా ఉండడంతో కుటుంబ సభ్యులు, ఆయన మద్దతుదారులు ఊపిరిపీల్చుకున్నారు. త్వరలోనే పూర్తిగా కోలుకుని తిరిగి ప్రజల మధ్యకి రాబోతున్నారని సమాచారం.

Related Posts
Pomegranate : దానిమ్మ పండు ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టారు
pomegranate fruit

దానిమ్మ పండులో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ ఎ, సి, ఇ అధికంగా ఉంటాయి. ఈ పండును క్రమం తప్పకుండా తింటే Read more

Paritala Sunitha: పరిటాల హత్యపై సునిత జగన్ పై సంచలన ఆరోపణలు
పరిటాల హత్యపై సునిత జగన్ పై సంచలన ఆరోపణలు

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తాజాగా మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త పరిటాల రవి హత్యలో వైఎస్ జగన్ పాత్ర ఉందని ఆమె Read more

Women: ‘మహిళ’ కు అర్థం చెప్పిన సుప్రీంకోర్టు ..చారిత్రాత్మక తీర్పు
'మహిళ' కు అర్థం చెప్పిన సుప్రీంకోర్టు ..చారిత్రాత్మక తీర్పు

'మహిళ' అనే పదానికి అర్థం ఏంటో యూకేలోని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 'మహిళ'అంటే చట్టపరంగా ఇదే అర్థం వస్తుందని పేర్కొంది. ఒక మహిళను చట్టపరంగా ఎలా Read more

PM Modi:జాతీయ ప్రజా సేవా దినోత్సవం సందర్భంగా పథకాల ఆధారంగా ఈ-పుస్తకాలను ప్రధాని విడుదల చేశారు
PM Modi జాతీయ ప్రజా సేవా దినోత్సవం సందర్భంగా పథకాల ఆధారంగా ఈ పుస్తకాలను ప్రధాని విడుదల చేశారు

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న జాతీయ ప్రజా సేవా దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో సేవలందిస్తున్న అధికారులకు విశేషమైన సేవల కోసం ప్రశంసలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×