కొడాలి నానికి గుండెపోటు ఆస్పత్రికి తరలింపు

AndhraPradesh: కొడాలి నానికి గుండెపోటు ఆస్పత్రికి తరలింపు

ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయన, ఛాతీ నొప్పితో బాధపడుతూ హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి లో చేరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుండగా, ఆయన ఆరోగ్యంపై వైసీపీ శ్రేణులు, అనుచరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

చికిత్స

కొడాలి నాని గతంలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో, తాజా గా ఆయన అస్వస్థత కు గురయ్యారు. గుండె సమస్య కారణంగా ఆయనకు ఛాతీ నొప్పి వచ్చిందా, లేక గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల వచ్చిందా అనే దానిపై డాక్టర్లు క్లారిటీ ఇచ్చేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు బైపాస్‌ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పినట్లు సమాచారం. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి గురించి అధికారికంగా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వైసీపీ శ్రేణుల్లో ఆందోళన

కొడాలి నాని ఆసుపత్రిలో చేరిన వార్త తెలియగానే, వైసీపీ శ్రేణులు, ఆయన అనుచరులు టెన్షన్‌కు గురయ్యారు.ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియకపోవడంతో, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

కొడాలి నానికి గుండెపోటు ఆస్పత్రికి తరలింపు

అధికారిక ప్రకటన

అసలు కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లు ఏం చెబుతారు? అనేది ఆసక్తికరంగా మారింది. వైద్య పరీక్షల అనంతరం, ఆసుపత్రి వర్గాలు అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.కొడాలి నానికి గతంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్న నేపథ్యంలో, ఇప్పుడీ ఛాతీ నొప్పి గుండె సమస్య కారణంగా వచ్చిందా? లేక సాధారణ అస్వస్థత మాత్రమేనా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

హైదరాబాద్ లో నివాసం

ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న కొడాలి నాని ఛాతీ నొప్పికి గురయ్యారు. దీంతో, ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.హార్ట్ అటాక్ గుండెకు రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు జరిగే ప్రాణాంతకమైన పరిస్థితి. ఇది సాధారణంగా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యల వల్ల కలుగుతుంది.

Related Posts
స్టీల్స్ ప్లాంట్ ను కేంద్రం ఆదుకుంటుంది – BJP చీఫ్ పురందీశ్వరి
purandeswari modi tour

రాష్ట్ర BJP అధ్యక్షురాలు పురందీశ్వరి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు విశాఖపట్నం పర్యటనకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం Read more

తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్
State Labor Minister Vasams

తిరుపతి : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తిరుపతిలోని ఈ ఎస్ ఐ హాస్పిటల్ని అకస్మాతుగా శుక్రవారం తనిఖీ చేసారు. అదేవిధంగా హాస్పటల్ లో Read more

చేనేత వస్త్రంపై చంద్రబాబు ఫ్యామిలీ ఫొటో
lokesh chenetha

మంగళగిరికి చెందిన టీడీపీ అభిమాని జంజనం మల్లేశ్వరరావు, ఆయన కుమారుడు కార్తికేయ మంత్రి నారా లోకేశ్కు ప్రత్యేకమైన బహుమతిని అందజేశారు. వారు చేతితో నేసిన చేనేత వస్త్రంపై Read more

తిరుపతిలో 144 సెక్షన్‌ అమలు..!
Implementation of Section 144 in Tirupati.

తిరుమల : తిరుపతిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో తిరుపతిలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఎస్వీ యూనివర్సిటీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×