సీఎం రేవంత్ రాజీనామా చేయాలి – కిషన్ రెడ్డి

కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ వెళ్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. 100 రోజుల్లోనే హామీలు నెరవేరుస్తామని వెనకడుగు వేశారని , తానెలాంటి హామీ ఇచ్చి వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, తెలంగాణ అని పలకడానికి కూడా కేంద్రం ఇష్టపడలేదని , రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ కిషన్ రెడ్డి వెంటనే మంత్రి వర్గం నుంచి తప్పుకోవాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

తాను ఎంపీ పదవిలో ఉండాలనేది సికింద్రాబాద్ ప్రజల నిర్ణయమని.. తాను పదవిలో ఉండాలా లేదా అనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారన్నారు. రేవంత్ రెడ్డి తనకు పదవి ఇవ్వలేదని ఎద్దెవా చేశారు. తన చివరి శ్వాస వరకు కమలం జెండా పట్టుకుంటానని.. బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను ఎవరికీ బానిసను కాదని.. వ్యక్తుల కోసం తాను రాజకీయం చేయడం లేదన్నారు. పార్టీకి, పార్టీ సిద్ధాంతానికి మాత్రమే తాను బానిసనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజీనామా చేయాల్సి వస్తే రేవంత్ చేయాలని కౌంటర్ ఇచ్చారు.