బయ్యారం స్టీలు ఫ్యాక్టరీ అసాధ్యం తేల్చేసిన కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రజలంతా బయ్యారం స్టీలు ఫ్యాక్టరీ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్ల బయ్యారం స్టీలు ఫ్యాక్టరీ ఫై కేంద్రం తీపి కబురు తెలుపుతుందేమో అని ఎదురుచూస్తుంటారు..కానీ కేంద్రం ఎలాంటి కబురు చెప్పకుండా నీరుకారుస్తుంది. మంగళవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోను అదే జరిగింది. కేవలం బయ్యారం స్టీలు ఫ్యాక్టరీ మాత్రమే కాదు తెలంగాణ కు ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీనిపై బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు కేంద్రం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ తరుణంలో బయ్యారంలో స్టీలు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. అక్కడ లభించే ఇనుప ఖనిజం నాణ్యమైనది కాదని, నష్టపోవడం కోసం ఫ్యాక్టరీ పెట్టలేమని తెలిపారు. మరోవైపు తాను ఎవ్వరికీ బానిస కాదని, పదవుల కోసం పార్టీ మారనని రాష్ట్ర నేతలనుద్దేశించి అన్నారు. తెలంగాణ సంక్షేమం కోసం కేంద్రం ఇప్పటివరకు రూ.6 లక్షల కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు.