'కింగ్‌డమ్' టీజర్ విడుదల.

‘కింగ్‌డమ్’ టీజర్ విడుదల.

రౌడీబాయ్‌ విజయ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాకు ‘కింగ్‌డమ్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. టైటిల్ తో పాటు బుధవారం నాడు టీజర్ ను కూడా ఆవిష్కరించారు. ఈ సినిమా టీజర్ తెలుగు వెర్షన్‌కి జూనియర్ ఎన్టీఆర్, తమిళ వెర్షన్‌కి సూర్య, హిందీ వెర్షన్‌కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ ముగ్గురు స్టార్లు తమ గొంతుతో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసి, టీజర్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లారు.”కింగ్‌డమ్’ చిత్రానికి విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. సినిమాని వేరే స్థాయికి తీసుకొని వెళ్ళడానికి తన వైపు నుంచి నూటికి నూరు శాతం కృషి చేస్తున్నారు. విజయ్ సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే, దేశవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టి ఉండటం సహజం. ‘కింగ్‌డమ్’ టీజర్ విడుదల తేదీ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి, ఈ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూశారు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టీజర్ కట్టిపడేసింది” అని నిర్మాతలు అన్నారు.

‘జెర్సీ’వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండను పూర్తిగా సరికొత్త అవతార్‌లో చూపిస్తున్నారు. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ తనదైన నేపథ్య సంగీతంతో మరోసారి కట్టిపడేశారు. టీజర్ లో విజయ్ పాత్రను దర్శకుడు చూపించిన తీరు, దానిని తన సంగీతంతో అనిరుధ్ మరో స్థాయికి తీసుకువెళ్లిన తీరు అద్భుతం. ఛాయాగ్రాహకులు జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ తమ కెమెరా పనితనంతో చిత్రానికి మరింత అందం తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాకి ఎడిటర్ గా నవీన్ నూలి, కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీస్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.

అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్

టీజర్‌లో మరో ప్రధాన ఆకర్షణ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. సంగీత పరంగా అద్భుతమైన మెలోడీ, థ్రిల్లింగ్ BGM సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.

సినిమాపై ప్రేక్షకుల అంచనాలు

టీజర్ విడుదలతో సినిమా రేంజ్ మరో స్థాయికి చేరుకుంది. విజయ్ దేవరకొండ తన స్టైల్, ఎనర్జీతో మాస్ అభిమానులకు పండుగలా మారనుండగా, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, అనిరుధ్ మ్యూజిక్ అదనపు ఆకర్షణలు.ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా భారీ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.

విజయ్ దేవరకొండ మాస్ లుక్

విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’లో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. టీజర్‌లో యాక్షన్ సన్నివేశాలు దుమ్ము రేపేలా ఉన్నాయి. ప్రత్యేకంగా విజయ్ దేవరకొండ మాస్ యాక్షన్, భావోద్వేగ భరితమైన నటన హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో టీజర్‌లోనే హింట్ ఇచ్చేశారు.

Related Posts
Sai Pallavi;తన పెళ్లిపై;సాయి పల్లవి ఒక్క మాటతో సమాధానం చెప్పింది.
sai pallavi

సాయిపల్లవి.. సహజ నటనకు కేరాఫ్ అడ్రెస్ గా పరిగణించబడుతున్న యాక్ట్రెస్. తెలుగు, తమిళ మరియు మలయాళ భాషల్లో ఆమెకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి సాయిపల్లవి, తాజాగా Read more

తిరువీర్‌ హీరోగా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రం ప్రారంభం
Masooda Movie Actor Thiruveer Wedding Photos 1

తాజాగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన కథానాయకుడు తిరువీర్, "మసూద" చిత్రంతో తన ప్రత్యేకమైన నటనతో గుర్తింపు పొందాడు. ఇప్పుడు, అతను కథానాయకుడిగా మరో క్రేజీ ప్రాజెక్టులో నటించేందుకు Read more

కళ్యాణ్ బాబాయ్ కి స్పెషల్ థ్యాంక్స్.. ఎమోషనల్ అయిన అల్లు అర్జున్
allu arjun

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ఇప్పుడు అందరిలోని దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే అపారమైన విజయాన్ని సాధించిన ఈ స్టార్, ఇప్పుడు బాలీవుడ్ Read more

జ్యోతిర్లింగాల యాత్రలో దర్శించుకున్న, కన్నప్ప టీమ్..
జ్యోతిర్లింగాల యాత్రలో దర్శించుకున్న, కన్నప్ప టీమ్..

టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టు "కన్నప్ప" సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్నారు. ఈ భారీ ప్రాజెక్టు, అభిమానుల అంచనాల మేరకు, చాలా కాలంగా Read more