రుణమాఫీ ఫై కీలక అప్డేట్

Telangana cabinet was inaugurated under the chairmanship of CM Revanth

రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15 లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరో వైపు మాఫీ అమలుకు విధివిధానాలపై కసరత్తు చేస్తోంది. అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.

పాస్ బుక్స్ , రేషన్ కార్డు ఉన్న వారికే రుణాలనే మాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎంపీలు, MLAలు, MLCలు, ఆదాయపన్ను చెల్లించేవారు, ఉద్యోగులను మినహాయించనున్నట్లు సమాచారం. కేబినెట్లో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. 2018 DEC 12 నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. 2-3 రోజుల్లో లబ్ధిదారుల జాబితా ప్రభుత్వానికి చేరనుంది.