కేతిరెడ్డి..జగన్ కు షాక్ ఇవ్వబోతున్నారా..?

వైసీపీ అధినేత జగన్ కు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి షాక్ ఇవ్వబోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అసెంబ్లీ ఎన్నికల్లో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ప్రజల్లో నిత్యం ఉండి..వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఉండే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓటమిని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. ఇక ఓటమి తర్వాత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి..జగన్ ఫై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

వైసీపీ ఓటమికి చాల కారణాలు ఉన్నప్పటికీ వాటికీ జగన్ మూలకారణమని చాలామంది చెపుతూ వస్తున్నారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సైతం ఇటీవల వరుసగా జగన్ ఫై విమర్శలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈయన కామెంట్స్ చూసి జనాలు ఆయన పార్టీని వీడే ఆలోచన ఉందా? పార్టీని వీడితే ఏ పార్టీలో చేరతారు? వైఎస్ జగన్ మనస్తత్వం తెలిసి కూడా ఆయన విమర్శలకు సిద్ధమవుతున్నారంటే కేతిరెడ్డి రాజకీయంగా తెగించినట్లే కనపడుతుంది. పార్టీ తనపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలనే ఆయన ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

తాజాగా జగన్ ప్రస్తుత ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను కూడా తప్పుపట్టారు. మనం మొత్తం అప్పులు చేసి ఒక్క ఏడాది టైం కూడా ఇవ్వకుండా వాళ్ళ మీద పడితే ఎలా? అంటూ ప్రశ్నించారు. వాళ్ళకి సంపద సృష్టికి టైం ఇవ్వాలి కదా? అని అన్నారు. ఒక్క ఏడాది కూడా ఆగలేరా? ఇదేమి రాజకీయం అంటూ జగన్ పై కేతిరెడ్డి నేరుగా విమర్శలకు దిగారు. ఇలా వరుసగా విమర్శలు , ఆరోపాలు చేస్తుండడం తో కేతిరెడ్డి వైసీపీ కి బై బై చెప్పడం ఖాయమని అంత మాట్లాడుకుంటున్నారు. మరి ఒకవేళ రాజీనామా చేస్తే..అయన ఏ పార్టీ లో చేరతారనేది ఆసక్తి గా మారింది.