పార్టీ మారడంపై కేతిరెడ్డి క్లారిటీ

వైసీపీ అధిష్టానానికి వరుసగా నేతలు షాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ముందే ఫలితాలను గ్రహించిన నేతలు వైసీపీ కి రాజీనామా చేసి టీడీపీ , జనసేన లో చేరి ఎమ్మెల్యేలుగా టికెట్స్ సాధించుకొని విజయం సాధించారు. ఇప్పుడు మిగతా నేతలు సైతం వరుసగా బయటకు వచ్చి టీడీపీ , జనసేన లలో చేరుతున్నారు. నిన్న మాజీ మంత్రి బాలిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జనసేన లో చేరుతున్నట్లు ప్రకటించారు.

జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేసారు. వీరి బాటలోనే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు వైరల్ గా మారాయి. ఇప్పటికే తన అనుచరులతో సమావేశమై..పార్టీ మార్పుపై చర్చించినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా.. ఈ వార్తలపై కేతిరెడ్డి స్పందించారు. తాను పార్టీలు మారే వ్యక్తిని కానని అన్నారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్‌ వెంటే ఉంటా అని స్పష్టం చేశారు. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని కేతిరెడ్డి అన్నారు.