నేడు సుప్రీం కోర్ట్ లో కేసీఆర్ కేసు విచారణ ..

విద్యుత్‌ కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీం కోర్ట్ లో పిటిషన్‌దాఖలు చేసారు. దీనిపై ఈరోజు (సోమవారం) సీజేఐ ధర్మాసనం విచారించనుంది. విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్ల స్థాపనపై సమీక్షకు నియమించిన జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్చి 14న జారీచేసిన జీవో 9ని సవాలు చేస్తూ కేసీఆర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయటం, హైకోర్టు దాన్ని కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే గతంలో కూడా కేసీఆర్‌ దీనిపై పిటిషన్‌ వేశారు. కానీ సుప్రీం ధర్మాసం దీన్ని తిరస్కరించింది. మరి ఈరోజు ఏంజరుగుతుందో చూడాలి.