తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేసీఆర్

KCR at Telangana Assembly media point

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అనంతరం అసెంబ్లీ ఈనెల 27కి వాయిదా వేశారు. అనంతరం మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు తొలిసారిగా చేరుకున్నారు. రాష్ట్ర బడ్జెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులను పొగిడినట్టే పొగిడి వెన్నుపోటు పొడిచారు.

అంత గ్యాస్ తప్ప ఏమి లేదు.ఐటీ పాలసీ ఏమి లేదు. ట్రాష్ ప్రసంగం లాగానే ఉంది. పేద ప్రజల పాలసి లేదు. వ్యవసాయ స్థిరీకరణ లేదు. స్టోరీ టెల్లింగ్ లాగానే బడ్జెట్ ప్రసంగం మారింది. ఏ ఒక్క పాలసీ మీదా కూడా నిర్దిష్టం గా లేదు. పద్దతి లేదు ఈ బడ్జెట్ లో.. ఈ బడ్జెట్ పై కాంగ్రెస్ ను చీల్చి చెండాడుతాం. ఈ ప్రభుత్వం ఆర్భక ప్రభుత్వం..రైతులను వంచించే ప్రభుత్వం.. ఇది చిల్లర మల్లర బడ్జెట్.. మాకు వ్యవసాయ స్థిరీకరణ పై పూర్తి అవగాహన ఉందని.. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని రెండు పంటలకు మేము నీళ్ళు ఇచ్చామని తెలిపారు.