పార్టీ మారే ఎమ్మెల్యేలపై లీగల్ ఫైట్ కు కేసీఆర్ సిద్ధం

బిఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచి ఇతర పార్టీలలో చేరుతున్న ఎమ్మెల్యేల ఫై లీగల్ ఫైట్ చేసేందుకు అధిష్టానం సిద్ధం అవుతుంది. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా..మరికొంతమంది కూడా ఇదే బాటలో ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో కేసీఆర్ చాల సీరియస్ గా ఉన్నారు. గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను అనుసరించి పార్టీ మారే వారిపై పిటిషన్లు వేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశాలు ఇచ్చింది. మరొకరు పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారో? తెలియని పరిస్థితి నెలకొంది. ఉన్నదే తక్కువ. అయినప్పటికీ రోజుకో ఎమ్మెల్యే ఊహించని విధంగా పార్టీ మారుతూ షాక్ ఇస్తున్నారు. ఇలాగే వదిలేస్తే పార్టీ మనుగడకు కష్టమని పార్టీ అధినేత భావిస్తున్నారు. వారికి చెక్ పెట్టేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే లీగల్‌గా కోర్టులకు వెళ్లి కట్టడి చేయాలని భావిస్తున్నారు. పార్టీని వీడిన ప్రతి ఎమ్మెల్యేపై అనర్హత పిటిషన్ వేయాలని కోర్టుకు ఎక్కేందుకు పార్టీ లీగల్ టీంను సన్నద్ధం చేస్తోంది.