నిడదవోలు పట్టణంలో విద్యార్థినులకు విద్యా కిట్లు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు విద్యా కిట్లు పంపిణీ చేసారు మంత్రి కందుల దుర్గేష్. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. క్రమశిక్షణ ఎదుగుదలకు సహకరిస్తుందని, పాఠశాలలో పుస్తక పాఠాలే కాకుండా జీవితం నేర్చుకోవాలని విద్యార్థులకు ఉపదేశించారు.

మంచి మార్కులు సాధించడానికి బాగా చదువుకుని ప్రయత్నించాలని, తగిన స్థాయిలో మంచి మార్కులు రాకపోయినా బలహీన పడకూడదని, రాబోయే కాలంలో మంచి మార్కులు సాధిస్తామని ధీమాతో ముందుకు సాగాలని సూచించారు. చదువుతోపాటు దేహదారుఢ్యానికి క్రీడలు కూడా అవసరం అన్నారు. చాలామంది కేవలం చదువు దృష్టితో ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరుకు గదులతోపాటు కనీసం ఆటస్థలం కూడా ఉండదని తెలిపారు. విద్యార్థులు ఎవరికి వారే అవగాహన పెంచుకుంటూ మనోబలాన్ని పెంచుకునేలా ఆలోచిస్తూ ముందు సాగాలని మంత్రి దుర్గేష్ సూచించారు.