Actor: థగ్ లైఫ్ ఈవెంట్ వాయిదా క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్

Actor: థగ్ లైఫ్ ఈవెంట్ వాయిదా క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా థగ్ లైఫ్. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత వీరి కాంబోలో సినిమా వస్తుందని తెలియడంతో ప్రేక్షకులలో మరింత హైప్ క్రియేట్ అయ్యింది.జూన్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. శింబు మరో ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే జింగుచా అనే పాటను విడుదల చేసి మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేశాడు. ఇక థగ్ లైఫ్ ప్రమోషన్స్‌లో కమల్ హాసన్ ముందు నుంచీ ఫుల్ జోష్‌తో పాల్గొంటున్నాడు.కమల్ హాసన్(Kamal Hassan) నిర్మాణంలో థగ్ లైఫ్ రాబోతోంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ కోసం తెలుగులోని కొన్ని చానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు కమల్ హాసన్. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న యుద్ద పరిస్థితుల గురించి తెలిసిందే. ఇండియా, పాక్ మధ్య ఎలాంటి భీకర వాతావరణం నెలకొందో చూస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో తన థగ్ లైఫ్ ఆడియో కార్యక్రమం జరపడం సరి కాదని కమల్ హాసన్ భావించాడు.

Advertisements

పరిస్థితులు

ప్రస్తుతం మన కోసం మన సైనికులు పోరాడుతున్నారని, అలాంటి తరుణంలో మనం ఇక్కడ ఆడియో ఈవెంట్ అని సంబరాలు చేసుకోవడం కరెక్ట్ కాదని అన్నాడు. 16వ తేదీన జరగాల్సిన ఈ ఈవెంట్‌ను పోస్ట్ పోన్ చేస్తున్నాను. ఇక త్వరలోనే కొత్త డేట్‌ను ప్రకటిస్తాం, మళ్లీ పరిస్థితులు చక్కబడిన తరువాత ఈ ఈవెంట్‌ను చేసుకుందాం అని కమల్ హాసన్ ట్వీట్ చేశాడు.ఈ సినిమాలో శింబు, త్రిష, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూన్ 5న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిని ప్రొడక్షన్ హౌజ్ రెడ్ జెయింట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

నెగెటివ్

ఇక కమల్ హాసన్ చివరగా భారతీయుడు 2 దారుణమైన దెబ్బ కొట్టాడు. శంకర్(Shankar) మీద పూర్తిగా నమ్మకం పోయేలా చేసిన చిత్రమిది. కమల్ హాసన్ నటన మీద, లుక్స్ మీద నెగెటివ్ ఇమేజ్ కల్పించిన సినిమా అది. అసలు ఇండియన్ 2 మూవీని శంకర్ ఎలా తీశాడు,కమల్ హాసన్ ఎలా నటించాడు? అని అంతా అనుమానపడేలా చేసిన మూవీ అది. ఇక ఇండియన్ 3 మాట అయితే ఇప్పటి వరకు ఎవ్వరూ ఎత్తడం లేదు. ఆ మూవీని తీయకుండా ఉంటేనే బెటర్ అని జనాలు అనుకుంటున్నారు. మరి కమల్ హాసన్, శంకర్ ఏం చేస్తారో? లైకా ఏం అంటుందో చూడాలి.

Read Also : Film Producer: తన మీద జరిగే ట్రోలింగ్ పై స్పందించిన కరణ్ జోహార్

Related Posts
Anushka : సడెన్‌గా ఇలా షాకి చ్చావేంటి అనుష్క
anushka shetty first malayalam movie kathanar 99372987

స్టార్ హీరోయిన్ అనుష్క గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఆమె సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సూపర్ స్టార్ నాగార్జునతో కలిసి నటించిన సూపర్ సినిమాతో Read more

రిలీజ్‌కు ముందే రికార్డులు మడతపెట్టేస్తున్న పుష్ప 2..
pushpa trailer release dat2

‘పుష్ప 2’ – అల్లు అర్జున్ మేనియా మరోసారి మోతెక్కించేందుకు సిద్ధం!‘పుష్ప: ది రైజ్’ ఘన విజయం తర్వాత అల్లు అర్జున్ స్థాయి అంతకంతకే పెరిగింది. ఈ Read more

Actor Parthiban: నా భార్య లేని ఇంటికి నేను వెళ్లలేదు:నటుడు పార్తీబన్
Actor Parthiban: నా భార్య లేని ఇంటికి నేను వెళ్లలేదు:నటుడు పార్తీబన్

మాస్ యాక్షన్ హీరోగా తనదైన ముద్ర వేసిన తమిళ నటుడు ఆర్. పార్తీబన్, తరువాత దర్శకుడిగా, నిర్మాతగా సినీ పరిశ్రమలో తన ప్రయాణాన్ని కొనసాగించారు. తాజాగా, ‘సుమన్ Read more

Bandla Ganesh: పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై స్పందించిన బండ్ల గణేష్
Bandla Ganesh: పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై స్పందించిన బండ్ల గణేష్

ఆంధ్రప్రదేశ్ స‌చివాల‌యంలో మంగ‌ళ‌వారం నాడు సీఎం చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న కేబినెట్ భేటీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డం జ‌రిగింది. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×