OTTలోకి కల్కి.. ఎప్పుడంటే..?

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD . బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, దిశా పటాని, యూనివర్స్ స్టార్ కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, సీనియర్ నటి శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తుంది.

కేవలం రెండు వారాల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్ల క్లబ్ చేరి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ భారీ బడ్జెట్ మూవీని ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాది భాషల OTT హక్కులను అమెజాన్ ప్రైమ్, హిందీ రైట్స్ ను నెటిక్స్ దక్కించుకుంది. ఈక్రమంలో రిలీజ్ తేదీపై ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. రిలీజైన 7-8 వారాల తర్వాత OTTలోకి వచ్చేలా ఆగస్టు 15న కల్కిని స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. మరి నిజంగా చేస్తారా..లేదా అనేది చూడాలి.