కల్కి నిర్మాతలకు భారీ షాక్

ప్రభాస్ నటించిన కల్కి మూవీ ఈరోజు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మేకర్స్ తో పాటు అభిమానులు హ్యాపీగా ఉన్నారు. ఇంతలోనే ఫుల్ మూవీ ఆన్లైన్ లో లీకై నిర్మాతలకు షాక్ ఇచ్చింది. 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా పైరసీకి గురవడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడే అవకాశం ఉందన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది. MovieRulz తో పాటు పలు వెబ్ సైట్లలో కల్కి మూవీ కనిపిస్తోంది.

గతంలోనూ పలు అగ్ర హీరోల సినిమాలకు ఈ పైరసీ దెబ్బ తప్పలేదు. హీరోలు పైరసీని ఎంకరేజ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా కొందరు కావాలనే సినిమా రిలీజ్ అయిన గంటల వ్యవధిలో ఆన్ లైన్ లో లీక్ చేస్తున్నారు. కల్కి మూవీ ఆన్ లైన్ లో లీక్ అవ్వడం పట్ల అటు ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.