కడెం 10 గేట్లు ఎత్తివేత

అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండ్రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. కలెక్టరేట్లలో కంట్రోలు రూములు ఏర్పాటు చేయాలని ఆదేశించిది. ఇరిగేషన్‌, హెల్త్‌ సిబ్బందికి సెలవులు రద్దుచేసింది.

అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎస్డీఆర్‌ఎఫ్‌ 50 మంది సిబ్బందితో 24 రెస్క్యూ బోట్లను సిద్ధం చేసింది. మరోవైపు, ఎడతెరిపిలేని వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694.700 అడుగుల వద్ద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 52,713 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 48,701 క్యూసెక్కులుగా ఉంది.