జైలు నుండి కవిత విడుదల..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ ఫై తిహార్ జైలు నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. మంగ‌ళ‌వారం రాత్రి 9:12 గంట‌ల‌కు జైలు నుండి బయటకు వచ్చారు. క‌విత జైలు నుంచి బ‌య‌ట‌కు రాగానే అక్క‌డే ఉన్న త‌న కొడుకును ఆలింగ‌నం చేసుకొని భావోద్వేగానికి లోన‌య్యారు. ఆ త‌ర్వాత భ‌ర్త అనిల్‌, అన్న‌య్య కేటీఆర్‌ను గుండెల‌కు హ‌త్తుకుని ఆనందంతో కన్నీరు పెట్టుకుంది.

ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. తనను జైలులో వేసి ఐదున్నర నెలలు పిల్లలకు దూరం చేశారంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతకాలం పిల్లల్ని వదిలి ఉండటం అంత సులువైన విషయం కాదని అన్నారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని..బెయిల్ రాకుండా చేసారని..ఎవర్ని వదిలిపెట్టమని ..వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించింది. ‘నేను సాధారణంగా మొండిదాన్ని. ఇంకా నన్ను జగమొండిని చేశారు. ఏ తప్పు చేయకపోయినా రాజకీయ కక్షతో కావాలనే ఇబ్బందులు పెట్టారు. మూల్యం చెల్లించి తీరుతా’ అన్నారు.