జూరాల ప్రాజెక్టుకు పొటెత్తిన వరద..37 గేట్లు ఎత్తివేత

Jurala project was flooded.. 37 gates were lifted

మహబూబ్‌నగర్‌: గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి లక్షా 70 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో అధికారులు 37 గేట్లు ఎత్తివేశారు. దీంతో 1,73,504 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.5 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.390 మీటర్ల వద్ద నీరు ఉన్నది. జలాశాయం గరిష్ట నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.444 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇక శ్రీశైలం జలాశయానికి 1,73,504 క్యూసెక్కుల వరద వస్తున్నది. 1,21,171 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 255 మీటర్ల వద్ద నీటిమట్టం ఉండగా, 58.59 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.