‘N కన్వెన్షన్‌’ కూల్చివేతపై స్పందించిన మంత్రి జూపల్లి

సినీ నటుడు నాగార్జున కు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్‌కన్వెన్షన్‌ హాల్‌ను నిర్మించారనే ఆరోపణలు ఎప్పటి నుండో వస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం పత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైనా పిర్యాదులు వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో, ఈ నిర్మాణం కు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించి..అక్రమంగా నిర్మాణం జరిగిందని తేలడంతో ఉదయం JSB లతో ఎన్‌కన్వెన్షన్‌ ను కూల్చేశారు. ఎన్ కన్వెన్షన్ లోపలికి వెళ్లే అన్ని దారులను అధికారులు మూసేసి..కనీసం మీడియాకు సైతం అనుమతి ఇవ్వకుండా రెండు గంటల్లో కూల్చేశారు.

ఈ కూల్చివేత ఫై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తి అంటే..ప్రజల ఆస్తి అని అన్నారు. కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సూచించారు. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్‌కన్వెన్షన్‌ హాల్‌ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం పత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైనా ఫిర్యాదుల వచ్చాయి. దీంతో పక్కా ఆధారాలతో ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు చేసిందన్నారు.